'పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'
PDPL: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రకాష్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన ఇవాళ జాతీయ ఎర్త్ డే అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ, పట్టణ స్థానిక సంస్థల వద్ద పోస్టర్ ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.