రూ.1,032 కోట్ల నిధులు విడుదల
TG: పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ. 1,032 కోట్లు విడుదలకు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల జీతాల బకాయిలకు రూ.712 కోట్లు, పంచాయతీరాజ్, R&B బిల్లుల కోసం రూ.320 కోట్లు విడుదల చేయనున్నారు. రూ.10 లక్షల లోపు బిల్లులు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.