గణేష్ నగర్లో డ్రైనేజీ సమస్యలు..!
MDCL: కుత్బుల్లాపూర్ పరిధిలోని గణేష్ నగర్ హౌసింగ్ కాలనీ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు నిత్య కృత్యంగా మారాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. రోడ్డుపై డ్రైనేజీ నీరు నిలిచి, దుర్గంధ భరితపు వాసన వస్తుందని, దీనిపై అధికారిక యంత్రాంగం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.