'Book a Call with BLO' సదుపాయాన్ని వినియోగించుకోవాలి'
E.G: ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన 'Book a Call with BLO' నూతన సదుపాయాన్ని జిల్లా ఓటర్లు వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ నోడల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ అనుభవాన్ని మెరుగుపరచడం, ఫెసిలిటేషన్ చర్యలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ మాడ్యూల్‌ను అమలులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.