SBIకి రూ. 6,337 కోట్ల ఐటీ నోటీసులు
SBIకి ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. 2023-24 ఏడాదికి సంబంధించి వడ్డీతో కలిపి రూ. 6,337 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఆదాయాన్ని తక్కువగా చూపారన్న ఐటీ శాఖ వాదనను ఎస్‌బీఐ తోసిపుచ్చింది. తాము నిబంధనల ప్రకారమే మినహాయింపులు కోరామని, ఈ నోటీసులపై అప్పీలుకు వెళ్తామని స్పష్టం చేసింది. దీనివల్ల బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.