పలు అభివృద్ధి పనులకు భూమి పూజ
NDL: ఆళ్లగడ్డ మండలం ఓబులపల్లెలో ఎంపీ ల్యాడ్స్, జెడ్పి నిధులు కలిపి రూ.20 లక్షలతో ఇవాళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. టీడీపీ నేత గౌరు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మహేంద్ర, సెక్రెటరీ బాలవర్ధిరాజు పాల్గొన్నారు. ప్రభుత్వ నిధులతో గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని నాయకులు పేర్కొన్నారు.