డంపింగ్ సమయంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ దగ్ధం
MHBD: కురవి మండల కేంద్రంలో సోమవారం చెత్త డంపింగ్ చేస్తున్న సమయంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ట్రాక్టర్ బొందలో ఇరుక్కుపోవడంతో ఇంజిన్ లాగిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సురక్షితంగా బయటపడగా, వాహనం పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.10 లక్షల నష్టం జరిగినట్లు సమాచారం.