ధర్నా శిబిరంలో CHOల వినూత్న నిరసన

SKLM: తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ గత కొద్ది రోజులుగా CHOలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం కూడా ధర్నా కొనసాగించారు. శ్రీకాకుళంలోని జ్యోతీరావు పార్కు వద్ద ధీక్షలో CHOలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి, కళ్లు, చెవులు మూసుకుని CHO, MLHPలు నిరసనను కొనసాగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.