బాడీ మసాజ్ సెంటర్ పై పోలీసుల దాడి

బాడీ మసాజ్ సెంటర్ పై పోలీసుల దాడి

కృష్ణా: విజయవాడ మొగల్‌రాజపురంలోని ఓ హోటల్లో బాడీ మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు శనివారం దాడి చేశారు. ఏసీపీ దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు కుమార్ రాజాపై కేసు నమోదు చేశారు. గతంలోనూ ఇదే తరహా కేసులో కుమార్ రాజా పట్టుబడ్డాడని ఏసీపీ తెలిపారు.