'నల్లబెల్లి మండల సమస్యలపై ఎమ్మెల్యే పర్యటించాలి'
WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం బీసీ హక్కుల సాధన కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో రహదారులు దెబ్బతిన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆరోపించారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే స్పందించాలని కోరారు.