'న్యాయం కోసం వచ్చే బాధితులకు సత్వర పరిష్కారం'
BDK: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆదేశించారు. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను వారు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. న్యాయం కోసం వచ్చే బాధితులకు సత్వర పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రతాప్, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.