కాంగ్రెస్‌లో‌కి చేరిన ఏకగ్రీవ సర్పంచ్

కాంగ్రెస్‌లో‌కి చేరిన ఏకగ్రీవ సర్పంచ్

GDWL: మానవపాడు మండలం గోగులపాడు గ్రామ ఏకగ్రీవ సర్పంచ్ భీమరాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం శాంతినగర్‌లోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్‌లోనే అభివృద్ధి సాధ్యమని భావించి పార్టీలో చేరినట్టు భీమరాజు తెలిపారు.