ములుగుకు బస్సులు పెంచండి మహాప్రభో

ములుగుకు బస్సులు పెంచండి మహాప్రభో

MLG: హన్మకొండ బస్టాండ్ నుంచి సాయంత్రం 5 దాటితే అరకొర బస్సులతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ములుగు వైపు సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాకు ఆర్టీసీ డిపో, జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ మంజూరైనప్పటికీ బస్సుల సంఖ్యను పెంచడం లేదని వాపోతున్నారు.