ధర్వేశిపురంలో కార్తీక సోమవారం శోభ
NLG: కనగల్ మండలం ధర్వేశిపురంలోని ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్తీకమాసం సోమవారం సందర్భంగా భక్తి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, సర్వదేవతల పూజలు, గోత్రనామాదులతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.