జగన్‌ను కలిసిన రాయదుర్గం పరిశీలకుడు
ATP: రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా నియమితులైన డా.బత్తల హరిప్రసాద్ గురువారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకుడిగా తనను నియమించినందుకు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితులపై జగన్ ఆయన అడిగి తెలుసుకున్నట్లు మీడియాతో వెల్లడించారు.