తానూర్‌లో మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల హెచ్చరిక
NRML: తానూర్‌లో భారీ శబ్దాలు చేసే మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎస్సై షేక్ జుబేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అధిక శబ్దం చేస్తున్న రెండు బైక్‌లను గుర్తించి, వాటి సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు సైలెన్సర్లు మార్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.