మలేరియా అధికారిగా జగన్‌మోహన్‌రావు

మలేరియా అధికారిగా జగన్‌మోహన్‌రావు

పార్వతీపురం: జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్ టి. జగన్‌మోహన్‌రావును నియమించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతవరకు జగన్‌మోహన్‌రావు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ)గా సేవలు అందించి ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు జిల్లా మలేరియా అధికారిగా బాధ్యతలు చేపట్టారు.