కాంగ్రెస్ హామీలపై బీజేపీ విమర్శలు
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన హామీలను బీజేపీ నాయకులు పంజా వెంకటేశ్వర్లు, జడ సతీష్, కుందూరు మహేందర్ రెడ్డి నేడు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ, ప్రజలు మాయమాటలు నమ్మవద్దని కోరారు. మున్సిపాలిటీ అభివృద్ధికి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.