ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

NGKL: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కల్వకుర్తి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.