మంచి మనసు చాటుకున్న కదిరి ఎమ్మెల్యే

మంచి మనసు చాటుకున్న కదిరి ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల రథోత్సవంలో గాయపడిన కుటుంబాలను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదుకున్నారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన విజయ్ శేఖర్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందజేశారు. మరో ఏడుగురు క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.