నెలసరి సెలవులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
మహిళలకు నెలసరి సెలవుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే మహిళలకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని పేర్కొంది. ఆ చట్టాన్ని తీసుకొస్తే యాజమాన్యాలు వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆ చట్టంతో తాము పురుషుల కంటే తక్కువనే మానసిక భయాన్ని మహిళల్లో సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు.