ఆర్‌యూబీ వద్ద రైల్వే రక్షక దళంతో భద్రత

ఆర్‌యూబీ వద్ద రైల్వే రక్షక దళంతో భద్రత

VZM: ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆర్‌యూబీ లోకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిన విషయం తెలిసిందే. ఆదివారం భారీ కుండపోత వర్షం కురవడంతో పూర్తిగా నిండిపోవడంతో స్థానికులను వెళ్లనీయకుండా రైల్వే రక్షక దళంతో భద్రతను పటిష్ఠం చేసారు. ప్రధాన రహదారిలో కొన్నిచోట్ల కాలువలు శాశ్వతంగా ముసివేయడంతో రోడ్డు మీద నీరు ఆర్‌యూబీలోకి ప్రవేశిస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి.