విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

కరీంనగర్‌లోని ఆటోనగర్‌లో విద్యుత్‌షాక్‌తో రమేశ్ (39) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వివరాలప్రకారం.. చింతకుంటలోని ప్రగతి నగర్‌కు చెందిన రమేశ్ లైట్ మిషన్ షాప్‌లో పనిచేస్తుండగా లైట్ మిషన్ వైరు తెగిపడడంతో విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.