గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి: మంత్రి
NLG: కనగల్ మండల సర్పంచులు హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని మంత్రి సూచించారు. కొత్త సర్పంచులు అంకితభావంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని దిశానిర్దేశం చేశారు.