టీ.ఎన్. టీ.యు. సీ అధ్యక్షులుగా లెంక శ్రీను

VZM: కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెం గ్రామానికి చెందిన లెంక శ్రీను టీ.ఎన్.టీ.యు. సీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నియమిక పత్రాన్ని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం ఆయనకు అందజేస్తూ, అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవికి వన్నె తెస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు.