చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి: DEO
ఖమ్మం: బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని అన్నారు. పైప్ బ్యాండ్ గర్ల్స్ కేటగిరిలో రాష్ట్రస్థాయి పోటీలలో ప్రథమ స్థానం సాధించిన వైరా తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల బాలికలను శనివారం DEO అభినందించారు. ఆకాశమే హద్దుగా ఎదిగి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని DEO ఆకాంక్షించారు.