TCS ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే

ప్రముఖ ఐటీ సేవల సంస్థ TCS జనవరి-మార్చి త్రైమాసికానికి వేరియబుల్ పే అలవెన్స్‌ను చెల్లించింది. మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికి నూరు శాతం చెల్లింపులు చేసినట్లు TCS తెలిపింది. తమ వ్యాపార విభాగాల పనితీరు ఆధారంగా మిగిలిన ఉద్యోగులకు వేరియబుల్ పే చెల్లింపులు చేసినట్లు పేర్కొంది. కాగా, ప్రతి త్రైమాసికంలోనూ టీసీఎస్ ఇదే విధానాన్ని అవలంబిస్తోంది.