బైక్ చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్
PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఈనెల 17న బైక్ చోరీ జరిగింది. కాగా, అమర్వాది మందమర్రికి చెందిన చెరుకుల సాయిచరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్ టౌన్ SI రమేష్ తెలిపారు. ఈ కేసును వెంటనే ఛేదించి, నిందితుని అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు సిబ్బందిని CI ఇంద్రసేనారెడ్డి అభినందించారు.