పిచ్చికుక్క వీరంగం.. ఐదుగురికి గాయాలు

పిచ్చికుక్క వీరంగం.. ఐదుగురికి గాయాలు

అన్నమయ్య: పిచ్చికుక్క ఒకే రోజులో ఐదుగురిని కరిచి గాయపరిచిన ఘటన నిమ్మనపల్లి మండలం దిగుపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామంలోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ దొరికిన వారిని దొరికినట్లు కరిచిందని గ్రామస్తులు తెలిపారు. వారిలో చంద్ర, కృష్ణ సింగ్, శ్రీనివాసులతో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారని వారు తెలిపారు. అధికారులు వెంటనే కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.