VIDEO: పెద్దాపురంలో అగ్నిమాపక వారోత్సవాల ర్యాలీ
KKD: పెద్దాపురంలో ఇవాళ అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఘనంగా ర్యాలీ నిర్వహించారు. విపత్తుల నిర్వహణలో అగ్నిమాపక శాఖ పాత్ర, సేవలను వివరిస్తూ పట్టణ పురవీధుల్లో ఈ ప్రదర్శన చేపట్టారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.