బస్సులు లేక భక్తుల తీవ్ర ఇబ్బందులు

బస్సులు లేక భక్తుల తీవ్ర ఇబ్బందులు

కడప: ఒంటిమిట్ట కోదండ రామయ్య కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు హాజరై తిరుగు ప్రయాణంలో రవాణా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్ధవటం మండలం భాకరాపేటలో గురువారం బస్సులు అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు లేకపోవడం వల్ల భక్తులు ప్రత్యామ్నాయ వాహనాల కోసం ప్రయత్నిస్తున్నారు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.