ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్వో
MNCL: భీమినిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని రికార్డ్స్, మందులు తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వైద్యుడు డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.