ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం
MNCL: జైపూర్ మండలం గోపాల్ పూర్ గ్రామంలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. గ్రామ శివారులో రహదారి పక్కన ఉన్న విద్యుత్తు స్తంభం పైకి భారీ చెట్టు, పాకే మొక్కలు అల్లుకుపోయాయి. ఈ తీగలు నేరుగా విద్యుత్తు తీగలు తాకడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందిచి సమస్యను పరిష్కరించాని రైతులు కోరుతన్నారు.