రహదారిని పరిశీలించిన హైవే టెక్నికల్ టీం

రహదారిని పరిశీలించిన హైవే టెక్నికల్ టీం

ప్రకాశం: సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు నూతన జాతీయ రహదారిపై ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదాల కారణాలను అధ్యయనం చేయడానికి బుధవారం నేషనల్ హైవే టెక్నికల్ టీం సభ్యులు రహదారిని పరిశీలించారు. కందుకూరు పోలీసులు, అధికారులు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చేపట్టాల్సిన పనులు, చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని హైవే సిబ్బందిని కోరారు.