సీసీ కెమెరాల ప్రారంభోత్సవం

BHPL: మహాదేవపూర్ మండలంలోని పూసుకుపల్లి గ్రామంలో 4 సీసీ కెమెరాలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, నేరాల నియంత్రణకు అలాగే నేరాలు చేసిన వారిని గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.