ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణి ప్రసవం

BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. శిశువు ఆరోగ్యవంతంగా ఉన్నట్లు బుధవారం వారు వెల్లడించారు. డీసీ హచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు పర్యవేక్షణలో ప్రసవం జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యం పై ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉండాలని వారు సూచించారు.