మిర్చి యార్డుకు వేసవి సెలవులు

GNTR: మిర్చి యార్డ్ కాపలా వర్కర్స్ యూనియన్, గుంటూరు చిల్లీస్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అభ్యర్ధన మేరకు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈనెల 12వ తేదీ నుండి జూన్ 8వ తేదీ వరకు మిర్చి యార్డ్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ యార్డ్ అధికారులు తెలిపారు. జూన్ 9వ తేదీ నుండి యధావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయి అన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.