గ్యాస్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

గ్యాస్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

వరంగల్: అధికారం చేపట్టినప్పటి నుంచి ధరలు అమాంతం పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలు బుద్ధి చెప్పాలని సీపీఐ మండల కార్యదర్శి  ఆరెల్లి రవి అన్నారు. సోమవారం వర్ధన్నపేటలో పెంచిన గ్యాస్ ,పెట్రోల్ ధరలను తగ్గించాలని ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ధరలు పెంచుతూ సామాన్యులు మోయలేని భారం మోపుతున్నారని విమర్శించారు.