'ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు'

'ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు'

కోనసీమ: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆలమూరు ఎస్సై నరేశ్ తెలిపారు. ఆలమూరు మండలం జొన్నాడ సెంటర్‌లో ఇవాళ సాయంత్రం ట్రాఫిక్ నిబంధనలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచనలు చేశారు. 10 మంది పై కేసులు నమోదు చేశామన్నారు.