ఉపాధి కూలీ ప్రదేశంలో మౌలిక వసతుల కరువు

SRPT: హుజూర్ నగర్‌లో శనివారం ఉపాధి హామీ ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాప్ ఓపెన్ కాక ఆలస్యమై ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు, వృద్ధులు ఉండడంతో వేసవి తాపానికి త్రాగునీరు,సేద తీరేందుకు నీడ లేక అల్లాడిపోయారు. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకుండా ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వహిస్తున్నారని కూలీలు ఆరోపించారు.