డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నిరసనలు
TPT: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఆయన సమావేశంలో ఉండగా జనసేన కార్యకర్త రాయుడి కుటుంబ సభ్యులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. రాయుడు హత్యకు న్యాయం చేయాలని రాయుడి సోదరి కీర్తి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాయుడిని హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.