భోజనశాలను ప్రారంభించిన మంత్రి
BPT: పంగులూరు(మం) చందలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మంగళవారం విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ, భోజన శాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని భోజనశాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.