ఇంటి స్థల విషయంలో మహిళపై దాడి
ATP: గుత్తి మండలం బసీనేపల్లి గ్రామ సమీపంలోని జిల్లా సరిహద్దు వద్ద గల హుసేనాపురం గ్రామంలో ఇంటి స్థల విషయంలో ఇరు వర్గాల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రజియాబి అనే మహిళపై మరో వర్గం కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. గాయపడిన ఆమెను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.