శబరిమల పోలీసుల తీరుపై మాధవ్ విమర్శలు

శబరిమల పోలీసుల తీరుపై మాధవ్ విమర్శలు

AP: శబరిమలలో పోలీసుల వ్యవహార శైలిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ తీవ్రంగా ఖండించారు. ఏపీ నుంచి వచ్చిన అయ్యప్ప స్వాముల పట్ల అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆయన విమర్శించారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.