'క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి'

'క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి'

ADB: క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని జిల్లా క్షయవ్యాధి నివారణ కోఆర్డినేటర్ సునీల్ పేర్కొన్నారు. గురువారం మావల మండలంలోని వాగాపూర్‌లో క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆత్రం దేవరావు, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్, గ్రామస్తులు పాల్గొన్నారు.