ఆటో డ్రైవర్ సేవకు పోలీస్ సెల్యూట్.!
GNTR: వేసవి వేడిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆటో డ్రైవర్ దేవ తన సర్వీస్ ఆటోలో 'మొబైల్ వాటర్ ట్యాంక్' ఏర్పాటు చేసి సేవ చేస్తున్నాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ A. హనుమంతు దీన్ని ప్రారంభించి ఆయన సేవా భావాన్ని అభినందించారు. ప్రతి ఏడాది ఇలా ముందుకు వస్తున్న దేవ సామాజిక బాధ్యతకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు.