'ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం'

VKB: ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా ఉంటానని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆయుబ్ అన్సారీ ఆర్థిక సహాయం అందించారు. కోట్ పల్లి మండలం కరీంపూర్ గ్రామానికి చెందిన కావలి రాజు కుమార్తె వివాహానికి శుక్రవారం రూ.1,01,100 పెళ్లి కానుకగా అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు తన సహాయ సహకారాలు కొనసాగుతాయని తెలిపారు.