నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఏలూరు మండలం శాంతినగర్ సెక్షన్, వట్లూరు సబ్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ అంబేద్కర్ తెలిపారు. లైన్ మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, అధికారులకు సహకరించాలని కోరారు.