వన మహోత్సవంలో భాగంగా 70 లక్షల మొక్కలు

BDK: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 70 లక్షల మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మంగళవారం సీఎస్ నిర్వహించిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా 58,345 దరఖాస్తులు స్వీకరించామని, దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తరువాత నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.