టీడీపీ నేతకు నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రావణి

ATP: నార్పల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పోతులయ్య అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం విషయం తెలుసుకున్న శింగనమల ఎమ్మెల్యే బండారి శ్రావణి.. పోతులయ్య భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.